బైపాస్ రోడ్ స్థలాన్ని పరిశీలించిన ప్రభుత్వ విప్

1చూసినవారు
బైపాస్ రోడ్ స్థలాన్ని పరిశీలించిన ప్రభుత్వ విప్
పెద్దపల్లి మండలం పెద్దకల్వల మీదుగా నూతన బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం స్థలాన్ని, పెద్దపల్లి పట్టణ కేంద్రంలోని పాత గ్రంధాలయ భవనాన్ని తొలగించి నూతన భవన నిర్మాణం కోసం స్థలాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు పరిశీలించారు. అనంతరం పెద్దపల్లి పట్టణంలోని బంధంపల్లిలో నూతన రూరల్ పోలీస్ స్టేషన్ భవన నిర్మాణం కోసం పోలీస్ అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. ఆయన వెంట అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్