ఆసుపత్రి నూతన భవన పనులను తనిఖీ చేసిన ప్రభుత్వ విప్

0చూసినవారు
ఆసుపత్రి నూతన భవన పనులను తనిఖీ చేసిన ప్రభుత్వ విప్
శనివారం, పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న 100 పడకల ఆసుపత్రి భవన నిర్మాణ పనులను ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పరిశీలించారు. జిల్లా ఆసుపత్రిని మాతా శిశు ఆస్పత్రిలో నిర్వహించడం వలన ప్రజల తాకిడి ఎక్కువగా ఉందని ఆయన అన్నారు. నూతన భవనాన్ని ఆరు నుంచి ఏడు నెలల్లో ప్రజలకు అందుబాటులోకి తేవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపారు. ఆయన వెంట అధికారులు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్