పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో బుధవారం బీరన్న పట్నాల మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ కొమ్మ పోచాలు, మండల అధ్యక్షుడు బొజ్జ శ్రీనివాస్, సర్పంచ్ శ్రీనివాస్, ఉప సర్పంచ్ కనకయ్య, ఆలయ ఉత్సవ కమిటీ నిర్వాహకులు,
కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ మహోత్సవం గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పింది.