సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని 15వ వార్డుకు చెందిన చొప్పరి అంజలి, గురువారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా, మున్సిపల్ ఎన్నికలలో పార్టీ మద్దతు తెలిపిన వారిని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని, బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి, సంక్షేమం జరిగిందని అన్నారు.