హిందూ ధర్మ రక్షణకు నడుం బిగిద్దాం..

0చూసినవారు
హిందూ ధర్మ రక్షణకు నడుం బిగిద్దాం..
ఆదివారం జూలపల్లి మండల కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన హిందూ సమ్మేళనంలో పాల్గొన్న శ్రీశ్రీశ్రీ కొత్తకోట శివానంద స్వామీజీ, ప్రతి హిందువు హిందూ ధర్మ రక్షణకు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. హిందుత్వం మానవాళి హితం కోరే ధర్మమని, హిందువు మతతత్వవాది కాదని ఆయన పేర్కొన్నారు. హిందువుగా హిందూ ధర్మాన్ని, సంస్కృతిని ఆచరించాలని, కుటుంబం నుండి పరివర్తన కొరకు మహిళలు పాటుపడాలని, దేవాలయాలను శక్తివంతము చేయాలని ఆయన వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్