శ్రీరాంపూర్‌లో మండల స్థాయి దివ్యాంగ క్రీడోత్సవాలు

985చూసినవారు
శ్రీరాంపూర్‌లో మండల స్థాయి దివ్యాంగ క్రీడోత్సవాలు
పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ మండల కేంద్రంలో మంగళవారం మండల స్థాయి దివ్యాంగ క్రీడోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి మహేష్ మాట్లాడుతూ, దివ్యాంగ పిల్లలకు క్రీడలు నిర్వహించడం అభినందనీయమని, తల్లిదండ్రులు వారిని సాధారణ పిల్లలతో సమానంగా చూసి ప్రోత్సహించాలని కోరారు. విజేతలకు మెమెంటోలు, మెడల్స్, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్