వాసవి మాత ఆశీస్సులు ప్రజలపై ఉండాలి: విప్

3చూసినవారు
వాసవి మాత ఆశీస్సులు ప్రజలపై ఉండాలి: విప్
ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు ఆదివారం సుల్తానాబాద్ పట్టణంలోని ఆర్యవైశ్య భవన్ ఆవరణలో గల శ్రీ వాసవి మాత దేవాలయంలో జరిగిన వాసవి మాత జయంతి, వార్షికోత్సవ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రజలపై శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత ఆశీస్సులు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. తమ ప్రభుత్వం ఆర్యవైశ్యులకు అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్