కేసీఆర్‌కు నోటీసులు సిగ్గుమాలిన చర్య: మాజీ ఎమ్మెల్యే

1చూసినవారు
కేసీఆర్‌కు నోటీసులు సిగ్గుమాలిన చర్య: మాజీ ఎమ్మెల్యే
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడం సిగ్గుమాలిన చర్య అని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. కేసీఆర్‌ను సిట్ విచారణ చేయడాన్ని నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నల్ల బ్యాడ్జిలు ధరించి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ మాజీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి బస్టాండ్ మీదుగా ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం వరకు సాగింది. పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.