నాగలింగేశ్వరస్వామి ఆలయంలో పారాయణం..

0చూసినవారు
నాగలింగేశ్వరస్వామి ఆలయంలో పారాయణం..
పెద్దపల్లి మండలం రాగినేడులోని శ్రీ స్వయంభు నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో బుధవారం, పెద్దపల్లికి చెందిన సనాతన ధర్మ పారాయణ కమిటీ ఆధ్వర్యంలో మహిళలు పారాయణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు భజనలు, కీర్తనలు ఆలపించారు. దేవాలయ పురోహితులు రాజేశ్వర శర్మ, ఆలయ కమిటీ చైర్మన్ భూమయ్య, కోలేటి శ్రీనివాస్ సారధ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కోలేటి పుష్పలత, రేణుక, స్రవంతి, అర్చన, ధనలక్ష్మి, జోష్ణతో పాటు పలువురు మహిళలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్