పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామంలో గురువారం శ్రీ పెద్దమ్మ తల్లి బోనాల మహోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, ఆలయ కమిటీ సభ్యులచే సత్కరించబడ్డారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ప్రజాప్రతినిధులు,
కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముదిరాజ్ సంఘం సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.