ఓదెల మండలం భీమరపల్లి గ్రామానికి చెందిన 90 ఏళ్ల భీమరి భూమయ్య మంగళవారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పోత్కపల్లి ఏఎస్ఐ కృష్ణ, రైటర్ రాజు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ సభ్యుల వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భూమయ్య ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.