పెద్దపల్లి: కుంభమేళాను తలపించే రీతిలో గోదావరి పుష్కరాలు

415చూసినవారు
పెద్దపల్లి: కుంభమేళాను తలపించే రీతిలో గోదావరి పుష్కరాలు
గోదావరి పుష్కరాలను కుంభమేళాను తలపించే రీతిలో నిర్వహించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మంథనిలో ఆదివారం ఆయన మాట్లాడుతూ, పుష్కరాల విజయవంతం కోసం ప్రభుత్వం సబ్ కమిటీని ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. కోట్లాదిమంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, ప్రతి గ్రామం నుంచి పుష్కర క్షేత్రాలకు చేరుకునేలా రవాణా సౌకర్యం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్