పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పెర్కపల్లి గ్రామంలో విషాహారం తిని 36 గొర్రెలు మరణించాయి. గురువారం 18, శుక్రవారం మరో 18 గొర్రెలు మరణించడంతో సుమారు రూ.3.60 లక్షల ఆర్థిక నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరిపి నష్టపరిహారం అందించాలని గ్రామస్థులు అధికారులను కోరుతున్నారు.