పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్‌లో హారిక (23) అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. రామడుగు మండలం రంగసాయిపల్లికి చెందిన హారికకు ఏడాదిన్నర క్రితం జుట్టు శరత్‌తో వివాహం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.