ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు మంగళవారం సాయంత్రం జూలపల్లి మండలం వడ్కాపూర్, వెంకటరావుపల్లి, కాచాపూర్, కీచులాటపల్లి, కుమ్మరికుంట, బాలరాజుపల్లి గ్రామాల్లో సింగిల్ విండో, ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
కాంగ్రెస్ సర్కారులో ఎలాంటి కోతలు లేకుండా, రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయని, అన్నదాతకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.