గింజ కటింగ్ లేకుండానే రైతుల ధాన్యం కొనుగోలు చేస్తున్నామని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు తెలిపారు. మంగళవారం పెద్దపల్లి మండలం పరిధిలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రైతు సమస్యల విషయంలో తాను ఎన్నడూ రాజీ పడేది లేదని స్పష్టం చేశారు.