ఓదెల మండలం రూపు నారాయణపేట, శానగొండ గ్రామాల మధ్య ఉన్న 27వ నంబర్ రైల్వే గేటును ఈనెల 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు సీనియర్ సెక్షన్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. పొత్కపల్లి, బిజిగిరి షరీఫ్ రైల్వే స్టేషన్ల మధ్య ట్రాక్ రిపేరు పనుల నిమిత్తం ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని సూచించారు.