రైల్వే శాఖ రూ.17.71 కోట్లతో లూప్‌లైన్ ప్లాట్‌ఫారం నిర్మాణం

0చూసినవారు
రైల్వే శాఖ రూ.17.71 కోట్లతో లూప్‌లైన్ ప్లాట్‌ఫారం నిర్మాణం
పెద్దపల్లి బైపాస్ క్యాబిన్ సమీపంలో లూప్‌లైన్ ప్లాట్‌ఫారం నిర్మాణానికి రైల్వేశాఖ రూ.17.71 కోట్ల నిధులు కేటాయించింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే NZB-WL, KZJ మార్గాల్లో వెళ్లే రైళ్లు PDPL టౌన్ రైల్వేస్టేషన్‌లోనే ఆగే అవకాశం కలుగుతుంది. దీంతో ఇంజన్ రివర్స్ అవసరం లేక సమయం ఆదా కావడంతో పాటు రైళ్ల ఆలస్యం తగ్గనుంది. బైపాస్ స్టేషన్‌కు అప్రోచ్ రోడ్డు నిర్మాణం చేపడితే ప్రాంత అభివృద్ధికి ఊతమిస్తుందని అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత పోస్ట్