రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా రాజ్ కుమార్

4చూసినవారు
రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా రాజ్ కుమార్
తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం పటేల్స్ యూత్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామానికి చెందిన రాజ్ కుమార్ ను నియమించారు. బుధవారం హైదరాబాదులో రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య నియామక పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి నియమించినందుకు వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని తెలిపారు. తెలంగాణ మున్నూరు కాపు సంఘం పటేల్స్ రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవన్న, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు ఆర్. వి. మహేందర్ కుమార్ లకు కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్