ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలోని సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద జరిగిన జాతర సందర్భంగా భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అమ్మవార్ల దర్శనం తర్వాత మహిళలు, యువతులు డీజే స్టెప్పులతో నృత్యాలు చేస్తూ పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. భక్తి, ఉల్లాసం కలిసిన ఈ వేడుకతో గద్దెల ప్రాంగణం కళకళలాడింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీగా భక్తులు హాజరై జాతర సందడిని ఆస్వాదించారు.