ఇసుక దందా: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రాజీనామా సవాల్!

1చూసినవారు
ఇసుక దందా: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రాజీనామా సవాల్!
ధర్మారం: ఇసుక దందాలో తాను డబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే వెంటనే తన పదవికి రాజీనామా చేస్తానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సవాల్ విసిరారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గత BRS ప్రభుత్వ హయాంలోనే పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా జరిగిందని మంత్రి ఆరోపించారు. ఇప్పటికైనా ఆరోపణలు మానుకోవాలని, దమ్ముంటే నిరూపించాలని ఆయన స్పష్టం చేశారు.