
లెక్చరర్ లైంగిక వేధింపులు..19 ఏళ్ల యువతి మృతి
హిమాచల్ ప్రదేశ్ ధర్మశాల ప్రభుత్వ కళాశాలలో 19 ఏళ్ల పల్లవి అనే విద్యార్థిని ర్యాగింగ్, లైంగిక వేధింపుల కారణంగా మరణించింది. గతేడాది సెప్టెంబర్ 18న లెక్చరర్, ముగ్గురు తోటి విద్యార్థులు ఆమెపై దాడి చేసి, బెదిరించారని, దీనివల్ల ఆమె ఆరోగ్యం క్షీణించిందని మృతురాలి తండ్రి ఫిర్యాదు చేశారు. వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన పల్లవి, డిసెంబర్ 26, 2025న లుధియానాలోని దయానంద్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో మరణించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు లెక్చరర్, ముగ్గురు విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు.




