అంగన్వాడి కేంద్రంలో పౌష్టికాహారం అందించిన సర్పంచ్ ప్రవీణ్

2718చూసినవారు
అంగన్వాడి కేంద్రంలో పౌష్టికాహారం అందించిన  సర్పంచ్ ప్రవీణ్
పెద్దపల్లి జిల్లా, ఎలిగేడు మండల కేంద్రంలోని అంగన్వాడీ సెంటర్ 1లో గురువారం, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నారులకు సర్పంచ్ కప్పల ప్రవీణ్ చేతుల మీదుగా పౌష్టికాహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని, 3 నుంచి 5 సంవత్సరాల పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపకుండా అంగన్వాడీ కేంద్రాలకు పంపాలని తల్లిదండ్రులను కోరారు. ఈ కార్యక్రమంలో టీచర్ జ్యోతి, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నారులు, తల్లులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్