పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా, పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని 33 వార్డులకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. ప్రజల కోసం నిజాయితీగా సేవ చేస్తున్నానని, అభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.