రామగుండం సిపి ఆదేశాల మేరకు, పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ గ్రామంలో 100 రోజుల పని చేసే వారికీ ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా షీ టీమ్ అవగాహన సదస్సు నిర్వహించింది. ఈ సందర్భంగా షీ టీమ్ SI లావణ్య మహిళల భద్రత, చైల్డ్ సేఫ్టీ, ఆన్లైన్ మోసాలు, యాంటీ డ్రగ్స్ గురించి వివరించారు. మహిళల రక్షణ కోసం బస్టాండ్, ప్రధాన చౌరస్తా, కాలేజీల వద్ద షీ టీం నిరంతరంగా ఉంటుందని, వేధింపులకు గురైనవారు 6303923700 నంబర్ కు ఫోన్ చేసి సమస్య తెలపాలని కోరారు.