పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ మండలంలో PSHMA శాఖ
ఎన్నికలు మంగళవారం స్థానిక మండల విద్యావనరుల కేంద్రంలో జరిగాయి. ఈ ఎన్నికలలో వోడ్నాల శ్యాంకుమార్ MPPS పందిళ్ళ అధ్యక్షులుగా, సముద్రాల ప్రవీణ్ కుమార్ వెన్నంపల్లి ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పెద్దపెల్లి జిల్లా శాఖ అధ్యక్షులు అత్తె రాజారాం, మండలంలోని పీహెచ్ఎంలు మరియు ప్రాథమిక ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో చురుగ్గా ఉండాలని నూతన కార్యవర్గాన్ని కోరారు. రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి K. శ్రావణ్ రెడ్డి, జిల్లా ఆర్థిక కార్యదర్శి P. శ్రీనివాస్ రెడ్డి, జి. శ్రీనివాస్, టి. రమేష్, వంశీధర్ కూడా అతిథులుగా పాల్గొన్నారు.