పెద్దపల్లి మండలంలోని నిట్టూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి సాగల అక్షర, వర్షిణి అనే ఇద్దరు
విద్యార్థులు బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపికయ్యారు. ఈ విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. లక్ష్మయ్య తెలిపారు. విద్యార్థుల ఎంపికపై ఉపాధ్యాయులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.