4 హౌస్ ల విభజనతో విద్యార్థులకు మేలు: కలెక్టర్

0చూసినవారు
4 హౌస్ ల విభజనతో విద్యార్థులకు మేలు: కలెక్టర్
జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాఠశాలల్లో విద్యార్థులను 4 హౌస్ లుగా విభజించడం వల్ల వారి వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయని తెలిపారు. సోమవారం పెద్దపల్లిలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల, జిల్లా గ్రంథాలయం, పురపాలక భవనం, ఆర్డీఓ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన, ఈ హౌస్ ల మధ్య వ్యాసరచన, క్విజ్, క్రీడా పోటీలు నిర్వహించడం ద్వారా విద్యార్థులకు మేలు జరుగుతుందన్నారు. జెడ్పీ పాఠశాలలో నాలుగు హౌస్ లను ఏర్పాటు చేసిన హెడ్ మాస్టర్, ఉపాధ్యాయులను ఆయన అభినందించారు.

ట్యాగ్స్ :