ఉపాధ్యాయ వృత్తి అత్యున్నతమైనది: కలెక్టర్

0చూసినవారు
ఉపాధ్యాయ వృత్తి అత్యున్నతమైనది: కలెక్టర్
జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, సమాజంలో ఎన్నో వృత్తులున్నా, ఒక తరాన్ని తీర్చిదిద్దే ఉపాధ్యాయ వృత్తి అన్నిటికంటే అత్యున్నతమైనదని పేర్కొన్నారు. సోమవారం సుల్తానాబాద్ మండలం పూసాల ఎంపిపిఎస్ పాఠశాల ఉపాధ్యాయురాలు సుజాత ప్రకాష్ రావు పదవీ విరమణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన, సుజాత ప్రకాష్ రావు తన సుదీర్ఘ సర్వీసులో చివరి రోజు వరకు అదే నిబద్ధతతో పనిచేయడం అభినందనీయమన్నారు. ఆమె పాటించిన సమయపాలన, క్రమశిక్షణతో కూడిన బోధన విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేశాయని కొనియాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్