పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు సోమవారం జూలపల్లి మండలం వెంకటరావుపల్లి నుండి కాచాపూర్ గ్రామం వరకు 12 కోట్ల రూపాయల డబల్ రోడ్డు పనులను పరిశీలించారు. అనంతరం స్కూల్ గోడ, గ్రామపంచాయతీ భవనం, స్వశక్తి మహిళ బిల్డింగ్ నిర్మాణాలకు ఒక్కొక్కదానికి 10 లక్షల చొప్పున అభివృద్ధి పనులను ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు.