చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించడమే లక్ష్యం: ఎమ్మెల్యే

1చూసినవారు
చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించడమే లక్ష్యం: ఎమ్మెల్యే
పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు ఆదివారం చొప్పదండి నియోజకవర్గంలోని రెవెల్లి ప్రాంతం నుండి పెద్దపల్లి నియోజకవర్గం పెద్దాపూర్ పెద్ద చెరువులోకి వచ్చే కాకతీయ కాలువ రూ. 25 లక్షల నిధులతో చేపట్టే మరమ్మతు పనులను నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ఎస్కేప్ కెనాల్ అయిన డీ-86 కాకతీయ కెనాల్ కుంగిపోవడంతో వెంటనే మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించడమే లక్ష్యమని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్