పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సోమవారం తెలంగాణ తొలి అమరుడు పోలీస్ కిష్టయ్య 16వ వర్ధంతిని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నిర్వహించారు. తెలంగాణ ముదిరాజ్ మహాసభ పెద్దపల్లి జిల్లా పక్షాన కిష్టయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో తొలి అమరాత్వాన్ని అందించిన ముదిరాజ్ జాతి గొప్పతనాన్ని మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు భూతగడ్డ సంపత్ కీర్తించారు. ముదిరాజులు ఐక్యమత్యంతో ముందుకు సాగి, రాబోవు కాలంలో అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని ఆయన పిలుపునిచ్చారు.