పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సోమవారం టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నియోజకవర్గ ఇన్ చార్జి, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ప్రత్యేక రాష్ట్రం కోసమే
కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటైందని, రాష్ట్రాన్ని సాధించే వరకు అలుపెరగని పోరాటం చేసిందని ఆయన గుర్తు చేశారు.
కేసీఆర్ పదేళ్ల పాలనలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, ప్రజలకు మేలు జరిగిందని తెలిపారు.