పెద్ద
పల్లి జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) జిల్లా అధ్యక్షులు పోగుల విజయ్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి సుంక మహేష్ లు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. మండలాల్లోని జర్నలిస్టులకు ఎస్ఎస్సీ అర్హతతో లేదా సీనియార్టీ ఆధారంగా అక్రిడేషన్లు అందించాలని వారు కోరారు.