పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన రాజేశ్వరి మానసిక సమస్యలతో బాధపడుతూ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పురుగుల మందు తాగిన ఆమెను కొడుకు సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు. చికిత్స పొందుతూ శనివారం మృతిచెందింది. మృతురాలి కొడుకు తిరుపతి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చంద్రకుమార్ తెలిపారు.