ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


Apr 29, 2026, 10:04 IST/

ఈవీఎంలపై టేపులు.. వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో గందరగోళం

Apr 29, 2026, 10:04 IST
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో, తుది విడత పోలింగ్ బుధవారం ఉద్రిక్తతల నడుమ కొనసాగుతోంది. 142 నియోజకవర్గాల్లో జరుగుతున్న ఈ ఓటింగ్‌లో TMC, ప్రతిపక్ష బీజేపీల మధ్య మాటల యుద్ధం ముదిరింది. డైమండ్ హార్బర్ నియోజకవర్గ పరిధిలోని ఫల్తా ప్రాంతంలో ఈవీఎంలపై బీజేపీ గుర్తు ఉన్న బటన్లను టేపులతో కప్పివేశారని, ఇది అధికార పార్టీ రిగ్గింగ్ వ్యూహంలో భాగమని బీజేపీ నేత అమిత్ మాల్వీయ ఆరోపించారు. ఈ ఆరోపణలపై పశ్చిమ బెంగాల్ ప్రధాన ఎన్నికల అధికారి (CEO) స్పందిస్తూ.. ఫిర్యాదులు వస్తే విచారణ జరిపి, అక్రమాలు తేలితే తిరిగి ఎన్నిక నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.