ధర్మారం వాసికి అంబేద్కర్ పూలే అవార్డు

ధర్మారం మండల కేంద్రానికి చెందిన బొల్లి స్వామికి సామాజిక సేవలో భాగంగా అంబేద్కర్ పూలే అవార్డు లభించింది. న్యూఢిల్లీలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఫౌండేషన్ వారు 29 రాష్ట్రాల నుండి ఎంపికైన వారికి ఈ అవార్డులు ప్రదానం చేశారు. ఈ అవార్డుకు ఎంపికైన సందర్భంగా రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆదివారం స్వామిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రూప్లానాయక్, నాయకులు సోగాల తిరుపతి, జనగామ తిరుపతి, పాలకుర్తి రాజేశంగౌడ్, అభిలాష్, రాజ్ కుమార్, దేవి జనార్దన్, గోపాలరెడి పాల్గొన్నారు.
