రామగుండంలోని సోమనపల్లి అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణపై గురువారం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. సర్పంచ్ గుంట బాపు, ఉపసర్పంచ్ ఏర్రోజు సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గర్భిణీలు సకాలంలో టి. టి ఇంజెక్షన్లు వేయించుకోవాలని, ప్రభుత్వం అందించే ఐరన్, కాల్షియం మాత్రలను క్రమం తప్పకుండా వాడాలని ఏఎన్ఎం లత సూచించారు. సురక్షిత ప్రసవాల కోసం ప్రభుత్వ ఆసుపత్రులనే ఆశ్రయించాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో యూనిఫాంల పంపిణీ కూడా జరిగింది.