నవంబర్ 4, మంగళవారం నాడు పెద్దపల్లి బంధంపల్లిలోని స్వరూప గార్డెన్స్ లో భారత వాయుసేనలో చేరేందుకు అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే ఈ సదస్సులో 16 నుండి 21 ఏళ్ల మధ్య వయసున్న, ఇంటర్మీడియట్ చదువుతున్న లేదా పూర్తి చేసుకున్న పురుష, మహిళా అభ్యర్థులు పాల్గొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా అధికారులు యువతకు అవగాహన కల్పిస్తారు.