అకాల వర్షాలకు నీట మునిగిన సెల్ టవర్

0చూసినవారు
అకాల వర్షాలకు నీట మునిగిన సెల్ టవర్
పెద్దపల్లి జిల్లా, రామగుండంలో అకాల వర్షాల కారణంగా తూముపల్లి కొండాపూర్ చెరువు కట్ట తెగి, సెల్ టవర్ నీట మునిగింది. టవర్ పరికరాలు దెబ్బతినడంతో ప్రజలకు ఫోన్ సదుపాయం నిలిచిపోయింది. ఈ మారుమూల ప్రాంతంలో ప్రత్యామ్నాయ టవర్ లేకపోవడంతో, సీనియర్ ఇంజనీర్ సిద్ధార్థ తన బృందంతో కలిసి, నీళ్లలోనూ విద్యుత్ షాక్ భయం లేకుండా పనిచేసి, సెల్ టవర్‌ను తిరిగి నిర్మించారు. ఈ చర్యను గ్రామస్తులు అభినందించారు. సెల్ టవర్ యజమానులు సిద్ధార్థ, వరుణ్ సాయి తేజలను ప్రశంసించారు.

సంబంధిత పోస్ట్