రామగుండం కార్పొరేషన్ 48వ డివిజన్‌లో శనివారం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన రూ. 60 వేల చెక్కును రేణుకుంట్ల తిరుపతికి అందజేశారు. ఆర్థిక ఇబ్బందులతో వైద్య ఖర్చులు భరించలేని నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నాయకులు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.