పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శనివారం విస్తృతంగా పర్యటించారు. ధర్మారం మండల తహసిల్దార్ కార్యాలయం, కేజిబీవీని కలెక్టర్ తనిఖీ చేశారు. స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్ సకాలంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని, భూ భారతి ఆన్ లైన్ దరఖాస్తులు పెండింగ్ ఉంచకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని అధికారులను ఆదేశించారు. కేజీబీవీలో బాలికలకు నాణ్యమైన ఆహారం, మంచి విద్యా ప్రమాణాలు అందేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.