రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ, ప్రజల సహకారంతోనే నేరాల నియంత్రణ సాధ్యమని తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ, పెద్దపల్లి, మంచిర్యాల జోన్‌ల ప్రజలు పండుగలు, సెలవులు, వివాహాల వంటి సందర్భాల్లో ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, చోరీలు, ఇతర నేరాలు జరగకుండా స్వీయ రక్షణ చర్యలు పాటించాలని సూచించారు.