
EPFO: PF నగదు విత్డ్రా పరిమితి రూ.5 లక్షలకు పెంపు
ఉద్యోగులు ఇప్పుడు UMANG యాప్ మరియు EPFO యాప్ ద్వారా తమ ప్రావిడెంట్ ఫండ్ (PF) నగదును విత్డ్రా చేసుకోవచ్చు. గతంలో ఉన్న రూ.1 లక్ష పరిమితిని రూ.5 లక్షల (75%) వరకు పెంచారు. ఈ మొత్తాన్ని బ్యాంక్ ఖాతాకు లింక్ అయిన UPI PIN ఉపయోగించి సులభంగా పొందవచ్చు. పెన్షనర్లు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్, నామినీ అప్డేట్ వంటి సేవలను కూడా పొందవచ్చని EPFO వెల్లడించింది. ఈ మార్పుల వల్ల సుమారు 8 కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతుందని అంచనా.




