పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆదివారం పాలకుర్తి మండలం కొత్తపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ ప్రవేశ ద్వారంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామ ప్రవేశ ద్వారాలు గ్రామాభివృద్ధికి ప్రతీకలని, గ్రామాల అభివృద్ధికి, మౌలిక వసతులు, రహదారులు, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో పురోగతి సాధించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారం తన బాధ్యత అని, పెద్దపల్లి ప్రాంత అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.