చేపల చెరువుల పునరుద్ధరణతో మత్స్యకారులకు ఉపాధి

2చూసినవారు
చేపల చెరువుల పునరుద్ధరణతో మత్స్యకారులకు ఉపాధి
పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గురువారం మేడిపల్లి ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టును సందర్శించి, ఓబీ డంప్ ప్రాంతాల్లోని చేపల చెరువులు, నీటి వనరులను పరిశీలించారు. వినియోగంలో లేని చేపల చెరువులను పునరుద్ధరించి చేపల పెంపకానికి ఉపయోగించాలని, తద్వారా స్థానిక నిరుద్యోగ మత్స్యకారులు, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆయన పేర్కొన్నారు. చేపల పెంపకం నిర్వహణను ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హత కలిగిన మత్స్యకార సహకార సంఘాలకు టెండర్ల ద్వారా అప్పగించే అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్