కార్మిక సంఘాలు బ్లాక్ డేగా ప్రకటించిన నేపథ్యంలో, బుధవారం గోదావరిఖని గాంధీ చౌక్ చౌరస్తాలో జిల్లా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు కార్మిక వ్యతిరేక కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన చేపట్టారు. ఐఎన్టీయుసి, ఏఐటీయుసి, సిఐటియు, ఐఎఫ్ టీయు, టీయుసీఐఈ ప్రతినిధులు మాట్లాడుతూ, ఈ నాలుగు లేబర్ కోడ్‌లు కార్మిక వర్గానికి తీరని అన్యాయం చేస్తాయని ఆరోపించారు.