
మహిళల రక్షణకు స్పందన టీమ్లు: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో చిన్నారులు, మహిళల రక్షణ కోసం సీఎం రేవంత్ రెడ్డి 'స్పందన' టీమ్లను ప్రారంభించారు. తక్షణ రక్షణ పేరుతో సభ్యులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఒక్కో ఏసీపీ జోన్కు రెండు టీమ్లు అందుబాటులో ఉంటాయి. వీటిని డయల్ 100/112లతో అనుసంధానం చేసి, ఫిర్యాదులపై ఆలస్యం లేకుండా వెంటనే చర్యలు తీసుకునేలా, అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించేలా ఏర్పాటు చేశారు. మహిళల భద్రతే స్పందన ప్రధాన ధ్యేయమని సీఎం తెలిపారు.




