15 లోపు హెచ్ఎల్ బీ బ్లాక్ నిర్దారణ పూర్తి: కలెక్టర్

0చూసినవారు
15 లోపు హెచ్ఎల్ బీ బ్లాక్ నిర్దారణ పూర్తి: కలెక్టర్
జనగణన-2027 కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 15లోపు హెచ్ఎల్ బీ బ్లాక్ నిర్ధారణ ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. బుధవారం పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో జనగణనపై సంబంధిత అధికారులతో ఆయన, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి సమీక్ష నిర్వహించారు. జనగణన 2027 రెండు దశలలో జరుగుతుందని, ప్రస్తుత ఏడాది హౌజ్ లిస్టింగ్ కార్యక్రమం మే 10 నుంచి ప్రారంభమవుతుందని, ప్రతి ఇంటికి సంబంధించి 35 ప్రశ్నల వివరాలు నెలరోజుల వ్యవధిలో సేకరించాలని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్