పార్లమెంట్‌లో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలంగాణ రాష్ట్ర హక్కులు, నీళ్లు, నిధులు, నియామకాల అంశాలపై ప్రస్తావించారు. 1969 తెలంగాణ ఉద్యమాన్ని గుర్తుచేస్తూ, అప్పటి పోరాట స్ఫూర్తి అవసరమని, కాకా వెంకటస్వామి వంటి నాయకుల త్యాగాలను వివరించారు. నీళ్లు, నిధులు, నియామకాలలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందనే కారణంతో ఉద్యమం జరిగిందని, కానీ హామీలు పూర్తిగా అమలు కాలేదని ఆయన పేర్కొన్నారు.